ఎనిమిదేళ్లకే స్వాతంత్ర్య కాంక్ష.. 14 ఏళ్లకే ఉద్యమ పంథా.. 23 ఏళ్లకే ప్రాణత్యాగం.. వందేళ్ల జీవిత పుస్తకంలో ఓ (అ)సాధారణ యువకుని కథ ఇరవై మూడు పేజీలతోనే ముగిసింది. మిగిలిన 64 పేజీలను యావత్ భారతదేశ యువజనం కోసం వదిలి వెళ్లాడు. ఉద్యమాల చరిత్రతో ఆ పేజీలను నింపుతూ భావి భారత నిర్మాతలకు పోరాట పాఠాలు బోధించాలని పిలుపునిచ్చాడు. సామ్రాజ్య వాద మద గజాల పీచమణిచే మావటి వాని అవతారమెత్తాలని యువతరంగానికి ఉద్భోదించాడు. భరతమాత దాస్య శృంఖలాలను తెంచేందుకు ఎంతకైనా తెగించాలి.., ఏం కోల్పోవడానికైనా సిద్ధంగా ఉండాలి.., అవి ప్రాణాలైనా సరే తృణప్రాయంగా అర్పించాలని చాటి చెప్పాడు. చెప్పడమే కాదు చేసి చూపి, భారతావని గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వీరకిషోరమే షహీద్ భగత్ సింగ్.
వీర పుత్రుడు భగత్ సింగ్-Shaheed Bhagat Singh
ReplyDeleteభారత విప్లవ వీర కిశోరం భగత్ సింగ్ కు విప్లవాభివందనాలు....
ReplyDelete