వల్లభాయ్ పటేల్ 1875, అక్టోబరు 31న గుజరాత్ రాష్ట్రంలోని నదియాద్ అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి జవేరిభాయ్ పటేల్ వ్యసాయం చేసేవాడు. తల్లి లాద్ బాయ్. వారికి ఆరుగురు సంతానంలో పటేల్ నాల్గవవాడు. వారిది సంపన్న కుటుంబం కాకపోవటం వల్ల పిల్లల్ని చదివించటం చాలా కష్టంగా వుండేది. అయినా వల్లభాయ్ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో స్కూల్ చదువు వరకు చదవగలిగాడు. స్కూలులో చదువుతున్నప్పుడు పుస్తకాలు కొనుక్కొనే స్తొమత లేకపోవటం వలన స్నేహితుల పుస్తకాలు తీసుకొని వాటిని బట్టి పట్టేవాడు.
ఒకసారి ఉపాధ్యాయుడు నీ పుస్తకం ఏది?" అని అడిగినప్పుడు, ఎంతో ధైర్యంతో "నాకు పుస్తకాలు కొనుక్కొనే స్తోమత లేదు కాబట్టి నోట్సు మాత్రమే రాస్తున్నాను. కానీ టెక్స్ట్ పుస్తకాల్లో ఇంత వరకు జరిగిన పాఠాలు అన్ని నాకు అక్షరం తప్పకుండా గుర్తున్నాయి అని చెప్పాడు. ఆ సమాధానం విన్న ఉపాధ్యాయుడు ఆశ్చర్యపోయి "ఏదీ ఆహార నియమాలు పాఠం చెప్పు చూద్దాం" అని అడిగాడు. అంతే పటేల్ అక్షరం పొల్లు పోకుండా పాఠాన్ని గడగడా అప్పగించేశాడు. అది విని ఉపాధ్యాయుడు ఆశ్చర్యపోయాడు. మెట్రిక్యులేషన్ తరువాత, కాలేజీ చదువులకు స్తోమతలేకపోవటం వల్ల ప్లీడరు పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యి, గోధ్రా అనే చిన్న పట్టణంలో ప్రాక్టీసు ప్రారంబించాడు. ప్రారంభించిన కొద్దిరోజులకే పటేల్ ప్రతిభను అందరూ గుర్తించసాగారు. అతను పట్టిన కేసులు ఓడిపోవటం అంటూ ఎప్పుడూ జరగలేదు. చివరకు ఆంగ్లేయులైన జడ్జీలు కూడా అతని వాదనను విని ముచ్చట పడేవారు.
ఇంగ్లాండులో బారిష్టరు పరీక్ష చదివేనిమిత్తం తనకు ప్రయాణంలో సహాయం చేయమని అర్ధిస్తూ వల్లభాయ్ పటేల్ ఒక ట్రావెల్ ఏజన్సీకి లేఖ రాశాడు. అది చదివిన ఏజన్సీవారు వెంటనే సహాయం చేయటానికి అంగీకరించి లేఖరాశారు. 1913లో బారిష్టరు పరీక్షలో ఉత్తీర్ణుడై భారతదేశం తిరిగి వచ్చి తన ప్రాక్టీసును మరింత వృద్ది చేసుకున్నాడు. ఆ సమయంలో బొంబాయి చీఫ్ జస్టిస్, సర్ బాసిన్ స్కాట్ పటేల్ ని ప్రభుత్వ సర్వీసులో చేరమని ఆహ్వానించాడు. అయితే దేశాభిమానం మెండుగాగల పటేల్ ఆ ఉద్యోగాన్ని తిరస్కరించి క్రిమినల్ లాయరుగా పేరు ప్రఖ్యాతలు పొందసాగాడు.
1917లో మొదటిసారిగా పటేల్ కు గాంధీలోని నిర్మలత్వం, నిరాడంబరత్వం, స్వార్ధరహిత ప్రేమ, దేశాభిమానం పటేల్ ను విశేషంగా ఆకర్షించాయి. భారతదేశంలో వ్యాపారం చేయటానికి వచ్చి, విభజించిపాలిస్తున్న ఆంగ్లేయులను తరిమి కొట్టాలనే ధృఢ నిశ్చయం ఆక్షణంలోనే తీసుకున్నాడు. ప్రజలలోకి చొచ్చుకొనిపోయి, వారి అవసరాలను తీర్చి, సహాయ సహకారాలు అందజేసి, వారిసహాయంతోనే విదేశీయుల్ని వెళ్ళగొట్టవచ్చుననే అభిప్రాయం కలిగి అహమ్మదాబాదు మున్సిపల్ ఎన్నికలలో పోటీచేసి సభ్యుడిగా ఎన్నికయ్యాడు. అనంతరం అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. పటేల్ అధ్యక్షుడిగా నిర్వహణా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన చేసిన సేవల వర్ణనాతీతం. నగరంలో ప్లేగు వ్యాధి విపరీతంగా వ్యాపించటం జరిగింది అప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలూ వ్యాపారసంస్థలూ అన్నీ మూసేసి ప్రజలు భయబ్రాంతులై ఉన్న సమయంలో పటేల్ ఆరోగ్య అధికారులతో నగరంలోని ప్రతి మారుమూల ప్రాంతంలోనూ తిరిగి ఒక్కరినీ వదలకుండా అందరికీ వైద్యం అందించాడు. రోగుల దగ్గర నిర్విరామంగా గడపటం వలన ఆయనకు కూడా దురదృష్టవశాత్తు ఆ వ్యాధి సోకింది. కొద్ది రోజుల్లోనే ఆయనకు వ్యాధి తగ్గింది.ప్లేగు వ్యాప్తి చెందినప్పుడే కాకుండా, వరదల్లోనూ, కరువుకాటకాల్లోనూ ప్రజలకు అండగానిలిచి వారి అభిమానం చూరగొన్నాడు.
గాంధీజీతో పాటు అనేక సత్యాగ్రహాలు చేసి సహాయ నిరాకరణోధ్యమాలు నిర్వహించి కారాగారాలు అనుభవించి బ్రిటీషు వారి గుండెల్లో గుబులు కలిగించాడు పటేల్. సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఉధ్యమంలోనూ పాల్గొన్నాడు. స్వతంత్ర భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వంలో హొం మంత్రిగా వీరు చేరారు. అప్పుడు దేశంలో 300చిన్నవీ, పెద్దవీ, స్వదేశంలో ఉండేవి. వీటిని స్వదేశ రాజులు పరిపాలించేవారు. వీటన్నిటినీ భారతదేశంలో విలీనం చేయటం ఎంతో కష్టం. అయినా సర్ధార్ పటేల్ వీటన్నిటిని ఒకే జెండా కిందకు తెచ్చారు. హైద్రాబాద్ ను కూడా దాని క్రిందకు తెచ్చారు. ఇలా 1948లో హైద్రాబాద్ భారత రాజ్యంలో అంతర్భాగం అయ్యింది. సర్ధార్ వల్లభయ్ పటేల్ 1950 డిసెంబరు 15న స్వర్గస్తుడయ్యాడు.
0 comments:
Post a Comment
Follow us @ www.facebook.com/YuvaNirmaan