భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు త
ిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది. చీకటిని త్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమవాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు.
నరకచతుర్దశికి,దీపావళికి నువ్వుల నూనె దీపాలనే వెలిగించాలంటొంది శాస్త్రం.ప్రతి సంవత్సరం క్రొత్త మట్టి ప్రమిదలు కొని వాటిని వాడాలి అంటొంది.
మట్టి ప్రమిద మన శరీరానికి సంకేతం.అందులో నువ్వులనూనె మన పూర్వజన్మ వాసనలకు(గత జన్మ నుండి మనకు ప్రాప్తించిన పాపపుణ్యాలు,అలవాట్లు,సంస్కారాలు)ప్రతీక.అందులో వేసే వత్తి అహంకారానికి గుర్తు.దీపం జ్ఞానానికి సంకేతం.జ్ఞానమనే దీపం మన పూర్వజన్మవాసనలను,అహంకారాన్ని,చెడు అలవాట్లను కాల్చేసి,పరమాత్ముడిని చేరుస్తుంది అన్నది దీపం వెలిగించడం వెనుక ఉన్న అర్ధం.అందువల్ల దీపావళికి మట్టి ప్రమిదలనే కొనండి.
ఈ ధనత్రయోదశి,నరక చతుర్దశి,దీపావళి పండుగ రోజుల్లో నువ్వుల నూనె దీపాన్నే వెలించాలి.నువ్వుల నూనె క్రిమిసంహారిణి.యాంటి-బ్యాక్టీరియల్(anti-bacterial) లక్షణాలు కలిగి ఉంటుంది.అందువల్ల నువ్వుల నూనె దీపం వాతావరణంలో ఉన్న క్రిములను నాశనం చేస్తుంది.అంతేకాదు ఈ దీపపు కాంతి కళ్ళకు మంచిది.దృష్టిని (eye-sight)మెరుగుపరుస్తుంది.ఇక దీపావళి నాడే ఎందుకు నువ్వుల నూనె దీపం పెట్టాలి అంటే దీపవళి చలికాలంలో వస్తుంది.సూర్యుడు భూమికి దూరంగా జరుగుతాడు.చల్లటి వాతావరణంలో అనేక క్రిములు వ్యాపిస్తాయి.అలాగే శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు వస్తాయి.ప్రమిదలో నూనె అయిపోయాక వత్తి కూడా కాలిపోతుంది.ఆ వత్తి కాలడం వల్ల వచ్చిన వాసన పీల్చడం ద్వారా ఊపిరితిత్తులు(lungs),గుండెకు(heart) సంబంధించిన రోగాలు రాకుండా నిరోధింపబడతాయి.అలాగే ఈ దీపం కొంత వేడిని కూడా పుట్టిస్తుంది.
ఏదైన ఒక వస్తువు కాలినప్పుడు carbon విడుదలవుతుంది.అది గాలిలో ఉన్న తేమను పీల్చేస్తుంది.కాని దీపారాధన వల్ల carbon తో పాటు నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి కాలడం వల్ల కొన్ని రకాలైన gases విడుదల అవుతాయి.అవి వాతావరణంలో చెట్లు పీల్చుకోలేని,భూతాపం (global warming)కు కారణమయ్యే కొన్నిgases తో కలిసి వాటి రూపాన్ని మార్చి పర్యవరణానికి మేలు చేస్తాయి.అందువల్ల అందరూ పర్యవరణ మరియు ఆరోగ్య పరిరక్షణకు దీపావళి నాడు నూనె దీపాలే వెలిగించండి.
మార్కెట్లో దీపావళి కి ప్రత్యేకమైన క్యాండిల్ దీపాలు అమ్ముతున్నారు.అవి వెలిగించకూడదు.సంప్రదాయ దీపం ప్రకృతిలో ఉన్నpositive energyని,దైవి శక్తులను ఆకర్షిస్తే,క్యాండిల్ negative energiesని,దుష్టశక్తులను ఆకర్షిస్తుంది.కావాలంటే మీరు ఒక చీకటి గదిలో క్యాండిల్ వెలిగించి కాసేపు కూర్చొండి.మరొకసారి అదే గదిలో దీపారాధన చేసి కూర్చోండి.మీరే గమనిస్తారు తేడా.క్యాండిల్ శోకానికి కారణమవుతుంది.దీపం శుభాలను తీసుకువస్తుంది.
ఎక్కడ దీపం పేడితే అక్కడ దేవతలు వస్తారు.అందువల్ల దీపకాంతులలో శ్రీ మహా లక్ష్మీని మీ ఇంట్లొకి ఆహ్వానించండి.
అందరికి ధనత్రయోదశి,నరకచతుర్దశి,దీపావళి శుభాకంక్షలు.
0 comments:
Post a Comment
Follow us @ www.facebook.com/YuvaNirmaan