కోతలు సరే పొదుపు ఎక్కడ?
- తగ్గుతున్న ఉత్పత్తితో మున్ముందు మరిన్ని కష్టాలు
- అనవసర, అతివాడకాన్ని తగ్గించాలంటున్న నిపుణులు
- వినియోగదారులు మేలుకుంటే అన్నివిధాలా మేలు
వానాకాలంలో ఏసీలేంటండీ బాబూ.. కాస్త కిటికీలను బార్లా తెరిచి చల్లగాలిని ఆస్వాదించండి..!
టీవీ సీరియళ్లు చూస్తూ కన్నీరు కార్చడం ఆపి, ఇంటిల్లిపాదీ అలా కాసేపు ఆరుబయట కబుర్లు చెప్పుకోండి..!
వాషింగ్ మిషన్లను అటకెక్కించేసి, ఎంచక్కా ఎవరి బట్టలు వాళ్లే ఉతుక్కోవడం మొదలెట్టండి..!
కాస్త ఎక్కువ ధరైనా తక్కువ యూనిట్లు ఖర్చయ్యే విద్యుత్ పరికరాలను తెచ్చుకోండి..!
ఎందుకంటారా..? పొదుపండీ.. పొదుపు..!
విద్యుత్ సంక్షోభం తీవ్రమైంది. ఉత్పత్తి పడిపోయి కనీవినీ ఎరగని ‘కట్’కట మొదలైంది. నిత్య కోతలతో పల్లె, పట్టణ ప్రజానీకం తల్లడిల్లుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని, అధికారయంత్రాంగాన్ని తిట్టుకోవడం సహజమే అయినా మనమెంత జాగ్రత్తగా విద్యుత్ వాడుకుంటున్నామో ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఈ విషయంలో వినియోగదారులు మేలుకొని అనవసర వాడకాన్ని తగ్గించుకుంటే అందరికీ మేలు జరుగుతుంది.
జిల్లాలో 5.28 లక్షల గృహాలకు విద్యుత్ కనెక్షన్లున్నాయి. గత జూలై నెలలో జిల్లాకు 92 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కేటాయించగా గృహావసరాలకు ఏకంగా 31 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగించుకున్నారు. అంటే జిల్లాకు కేటాయించిన వి ద్యుత్‌లో 33.69 శాతం వాటికే సరిపోయింది. ఇందులో దాదాపు 20 నుంచి 30 శాతం వరకు విద్యుత్‌ను పొదుపు చేసే అవకాశం ఉందని విద్యుత్ శాఖ అధికారులు, నిపుణులు పే ర్కొంటున్నారు. ఇక మిగిలిన దాంట్లో జిల్లాలోని 240 భారీ పరిక్షిశమలకు 35 మిలియన్ యూనిట్లు అంటే 38 శాతం వినియోగిస్తున్నారు.
ఈ లెక్కన 71 శాతానికి పైగా ఈ రెండు కేటగిరీలకే వినియోగిస్తున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇక 40566 కేటగిరీ-2 కమర్షియల్ కనెక్షన్లకు 5 మిలియన్ యూ నిట్లు అంటే 5.43 శాతం, కేటగిరీ-3 కిందకు వచ్చే పరిక్షిశమల కు సంబంధించిన 3467 కనెక్షన్‌లకు 2 మిలియన్ యూనిట్లు అంటే 2.17 శాతం, కేటగిరీ-4 కిందకు వచ్చే ధోబీఘాట్స్, హా ర్టికల్చర్‌కు సంబంధించి 68 కనెక్షన్లకు 0.01 మిలియన్ యూ నిట్లు, కేటగిరీ-5 కిందకు వచ్చే వ్యవసాయ పంపుసెట్ల కనెక్షన్లు 86,446 ఉండగా 12.88 మిలియన్ యూనిట్లు అంటే 14 శా తం, కేటగిరీ-6 కిందకు వచ్చే మంచినీటి పథకాలు, వీధిదీపాల కనెక్షన్లు 6658 ఉండగా 5.097 మిలియన్ యూనిట్లు అంటే 5.54 శాతం, కేటగిరీ-7 కిందకు వచ్చే పాఠశాలలు, దేవాలయాలు, మదర్సాలకు సంబంధించిన 4425 కనెక్షన్లుండగా 0.409 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగించుకుంటున్నారు.
విద్యుత్ ఉత్పత్తి పడిపోవడంతో కోతలు అనివార్యమవుతున్నాయి. ఇందుకు జిల్లాకు ఈ నెల 22న 4.35 మిలియన్ యూనిట్ల కోటా కేటాయించారు. అంటే 4.35 మిలియన్ యూ నిట్ల విద్యుత్‌ను జిల్లాలోని వినియోగదారులు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అయితే విద్యుత్ ఉ త్పత్తి తక్కువగా ఉండడంతో భారీగా కోతలు విధించారు. ఈ కారణంగా 2.963 మిలియన్ యూనిట్లు మాత్రమే వినియోగించుకోగలిగాం. ఏదేమైనా దేశ వ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరిగిపోవడం, అందుకు అనుగుణంగా ఉత్పత్తి లేకపోవడంతో ఈ సంక్షోభం తలెత్తుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్క వినియోగదారుడు తన బాధ్యతగా విద్యుత్ ఆదా చేయడం ద్వారా ఈ విపత్కర పరిస్థితి నుంచి కొంతమేర ఉపశమనం పొందే అవకాశం ఉంది.
వినియోగదారులకు సూచనలు
- విద్యుత్ బల్బులు, ట్యూబ్‌లైట్లకు బదులుగా ఫ్లోరో సెంట్(సీఎఫ్‌ఎల్) బల్బులనే వాడాలి.
- తక్కువ విద్యుత్ ఖర్చుతో నడిచే (స్టార్ రేటెడ్) రిఫ్రిజ్‌రేటర్లు, ఏసీ, వాషింగ్ మిషన్లనే వినియోగించుకోవాలి.
- ఎలక్ట్రానిక్ చౌక్‌తో వస్తున్న టీ-5 ట్యూబ్‌లైట్లను వినియోగించాలి.
- సోలార్ హీటర్లను మాత్రమే వాడాలి. అత్యవసరమైతే గీజర్లను వినియోగించాలి.
- ఏసీని అవరసరం ఉన్నప్పుడే వినియోగించుకోవాలి. టెంపరేచర్‌ను 24 డిగ్రీలకు పరిమితం చేయాలి. దీంతో 8 శాతం విద్యుత్ ఆదా అవుతుంది.
-అవసరం ఉన్నప్పుడు మాత్రమే లైట్లు, టీవీలు, ఫ్యాన్లను వాడాలి. మిగిలిన సమయాల్లో వాడకాన్ని తగ్గించాలి.
- వాషింగ్‌మిషన్ల వాడకాన్ని కొంత మేరకు తగ్గించాలి.
రైతులు చేయాల్సినవి..
- రాపిడి లేని ఫుట్‌వాల్వ్‌ను వాడాలి. ఐఎస్‌ఐ మార్కుగల మోనో బ్లాక్ పంపు సెట్లను, సబ్ మెర్సిబుల్ పంపుసెట్లను ఉపయోగించాలి. హెచ్‌డీపీఈ, పీవీసీ పైపులను వాడడం, రేటింగ్ కలిగిన కెపాసిటర్లను బిగించుకోవాలి. పైపుల్లో ఎక్కువగా బెండ్లు, అతుకులు లేకుండా చూడాలి. పంపుసెట్లను క్రమం తప్పకుండా లూబ్రికేట్ చేయిస్తూ ఉండాలి.
- ఫ్రిక్షన్‌లెస్ ఫుట్‌వాల్వుతో 3 నుంచి 5 శాతం విద్యుత్ ఆదా అవుతుంది.
-హీట్ అవుతున్న మోటార్లను వెంటనే రిపేరు చేయించుకోవాలి.
- హెచ్‌డీపీఈ, పీవీసీ పైపులు వాడడం, ఐఎస్‌ఐ పంపుసెట్లు అమర్చుకోవడంతో 35 నుంచి 40 శాతం విద్యుత్ ఆదా అవుతుంది.
- ఉచిత విద్యుత్ పొందే రైతులు తమ పంపుసెట్లకు కెపాసిటర్లను బిగించుకోవడంతో ఓల్టేజీ 10 శాతం మెరుగవుతుంది. విద్యుత్ సైతం ఆదా అవుతుంది.
గ్రామపంచాయతీలు,ప్రభుత్వ కార్యాలయాల వారు చేయాల్సినవి..
- వీధి దీపాలను రాత్రి వేళల్లోనే వినియోగించుకోవాలి. ప్రత్యేక లైనును ఏర్పాటు చేసి ఆన్ ఆఫ్ స్విచ్‌లను బిగించాలి. వీధి దీపాల కోసం ఎలక్ట్రానిక్ ట్యూబ్‌లైట్లను ఏర్పాటు చేయాలి.
- కార్యాలయ పనివేళల్లో మాత్రమే ఫ్యాన్లు, ఏసీలు, లైట్లు వాడాలి.
- ఏసీ గదుల్లో గోడల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి మరమ్మతులు చేయించాలి.
- చెడిపోయిన లైట్లు, పరికరాలు, వైర్లను ఎప్పటికప్పుడు మార్చాలి.
-ఎప్పటికప్పడు ఫ్యూజ్ తదితర పరికరాలను పరిశీలించి విద్యుత్ సక్రమంగా వినియోగమయ్యేలా చూడాలి.
పరిశ్రమల్లో..
- విద్యుత్, యంత్ర పరికరాలను ప్రమాణాలకు తగినట్లుగా వినియోగించుకోవాలి.
- పగటిపూట లైట్ల వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి.
- భారీ లైట్ల ఏర్పాటులో విద్యుత్ ఆదాను పరిగణలోకి తీసుకోవాలి.
- లిఫ్ట్‌ల వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి.
- వివిధ యంత్రాలలో చెడిపోయిన బేరింగ్‌లను వెంటనే మార్చాలి.
- విద్యుత్ ఆదాకు సంబంధించి కార్మికులకు, సిబ్బందికి అవగాహన కల్పించాలి.
Written By-Boddu Mahendar
0 comments:
Post a Comment
Follow us @ www.facebook.com/YuvaNirmaan